: అరటి తోటలో ‘ఎర్ర’ డంప్... కడప జిల్లాలో స్మగ్లర్ల కొత్త స్థావరాలు
ఏపీలో శేషాచలం కొండల్లోని విలువైన ఎర్రచందనం అక్రమ మార్గాల్లో దేశం సరిహద్దులు దాటిపోతూనే ఉంది. పోలీసులు ముప్పేట దాడులు చేస్తున్నా, స్మగ్లర్లు ఎప్పటికప్పుడు కొత్త మార్గాలు ఎంచుకుంటున్నారు. నేటి ఉదయం కడప జిల్లా రైల్వే కోడూరు మండలం జానకీపురం సమీపంలోని అరటి తోటల్లో సోదాలు చేసిన పోలీసులు భారీ ‘ఎర్ర’ డంప్ ను స్వాధీనం చేసుకున్నారు. విదేశాలకు తరలించేందుకు సిద్ధం చేసిన 69 ఎర్రచందనం దుంగలను పోలీసుల కంటబడకుండా స్మగ్లర్లు అరటి తోటల్లో దాచేశారు. సమాచారం అందుకున్న పోలీసులు రూ.1.5 కోట్ల విలువ కలిగిన ఈ డంప్ ను స్వాధీనం చేసుకున్నారు. ఇక పోలీసుల అలికిడిని కాస్త ముందుగానే పసిగట్టిన స్మగ్లర్లు అక్కడి నుంచి చిన్నగా జారుకున్నారు.