: వసీం అక్రమ్ కారుపై కాల్పుల కేసులో ఒకరి అరెస్ట్
పాకిస్థాన్ మాజీ క్రికెటర్ వసీం అక్రమ్ కారుపై కరాచీలో జరిగిన కాల్పుల కేసులో ఓ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. అతను ఓ ప్రైవేట్ సెక్యూరిటీ గార్డు అని, అతని యజమాని కోసం పోలీసులు వెతుకులాట మొదలుపెట్టినట్టు పాక్ ఛానల్ జియో టీవీ పేర్కొంది. అక్రమ్ కారుపై కాల్పులు జరిగిన సమయంలో ఆ యజమాని కూడా అక్కడ ఉన్నాడని పోలీసులు చెప్పారు. ఇటీవల తన ఇంటి నుంచి నేషనల్ స్టేడియంకు అక్రమ్ కారులో వెళుతున్న సమయంలో షా ఫైసల్ రోడ్డులో అనూహ్యంగా కాల్పులు జరిగాయి. అయితే ఎలాంటి ప్రమాదం జరగకుండా అక్రమ్ బయటపడ్డారు.