: రెండు రోజుల నుంచి ఆహారం ముట్టని సంజయ్ దత్... మేనత్త మరణంతో ఆవేదన!


పూణేలోని ఎరవాడ జైలులో శిక్ష అనుభవిస్తున్న ప్రముఖ బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ గత రెండు రోజులుగా ఆహారం ముట్టుకోవడం లేదు. తన మేనత్త రాణి బాలి (సంజయ్ దత్ తండ్రి సునీల్ దత్ సోదరి) చనిపోయిందన్న వార్త తెలియడంతో ఆయన తీవ్ర వేదనకు గురయ్యారు. మేనత్త అంత్యక్రియలకు హాజరుకావాలని సంజయ్ కోరినప్పటికీ, జైలు అధికారులు ఆయనకు పర్మిషన్ ఇవ్వలేదు. దీంతో, జైల్లోనే తన మేనత్తకు ఆయన సంతాపం ప్రకటిస్తున్నారు. కనీసం ఎవరితోనూ ఆయన మాట్లాడటం లేదు. తన సెల్ లోనే తాత్కాలికంగా ఏర్పాటు చేసుకున్న పూజ మందిరం ఎదుటనే ఆయన కూర్చుంటున్నారు. బయటకు బిగ్గరగా ఏడవకపోయినప్పటికీ, సంజయ్ కళ్లనిండా అప్పుడప్పుడు నీళ్లు నిండుతున్నాయని తోటి ఖైదీలు చెబుతున్నారు. సంజయ్ దత్ కు చిన్నప్పటి నుంచి తన మేనత్తతో ఎంతో సాన్నిహిత్యం ఉంది. దీంతో, ఆమె మరణాన్ని సంజయ్ తట్టుకోలేకపోతున్నారు.

  • Loading...

More Telugu News