: నా ఫొటోలను నా దేశంలోనే తగలబెడుతున్నారు: ఆవేదన వ్యక్తం చేసిన అద్నాన్ సమీ


ప్రముఖ గాయకుడు అద్నాన్ సమీ సంతోషంతో పాటు ఆవేదనను కూడా అనుభవిస్తున్నాడు. పాక్ జాతీయుడైన సమీకి ఆ దేశం వీసా గడువు పొడిగించకపోవడంతో... ఇక్కడే నివసించేందుకు అనుమతించండి అంటూ భారత ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాడు. దీంతో, ఎంతకాలమైనా భారతో లో ఉండొచ్చని కేంద్ర హోం శాఖ అతనికి అనుమతి మంజూరు చేయడమే కాదు... ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది కూడా. దీంతో, సమీ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. పాక్ పౌరసత్వాన్ని త్యజిస్తున్నట్టు అతను ప్రకటించాడు. 14 ఏళ్లుగా నివాసం ఉంటున్న భారతే తన సొంత గడ్డ అని పేర్కొన్నాడు. అయితే, భారత్ లోనే ఉండాలన్న సమీ నిర్ణయం పట్ల పాకిస్థానీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అతని ఫొటోలను తగులబెడుతున్నారు. దీనిపై సమీ స్పందిస్తూ, తన సొంత దేశంలోనే తన ఫొటోలను తగులబెట్టడం బాధిస్తోందని అన్నాడు. అయితే భారత్ అన్నా, ఇక్కడ నివసించడం అన్నా తనకు ఎంతో ఇష్టమని... ఆ ఇష్టం కోసం ఎంత బాధనైనా అనుభవిస్తానని చెప్పాడు. లండన్ లో పుట్టిపెరిగిన అద్నాన్ సమీ తండ్రి పాకిస్తాన్ జాతీయుడు కాగా, తల్లి కశ్మీర్ కు చెందిన భారత జాతీయురాలు.

  • Loading...

More Telugu News