: కాబూల్ లో రెండు బాంబు పేలుళ్లు... 35 మంది మృతి


ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్ బాంబు పేలుళ్లతో దద్దరిల్లింది. ఇవాళ జరిగిన ఆత్మాహుతి దాడి, బాంబు దాడితో నగరం రక్తసిక్తమైంది. ముందుగా స్థానిక గవర్నమెంట్ కాంప్లెక్స్ వద్ద జరిగిన బాంబు పేలుడులో 15 మంది మృతి చెందినట్టు స్థానిక అధికారులు తెలిపారు. తరువాత కాబూల్ పోలీస్ అకాడమీ లక్ష్యంగా జరిగిన ఆత్మాహుతి దాడిలో 20 మంది చనిపోయారన్నారు. మరో 25 మందికి గాయాలయ్యాయని చెప్పారు. ప్రస్తుతం పోలీసుల సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. క్షతగాత్రులను ఆసుపత్రిలో చేర్చారు.

  • Loading...

More Telugu News