: ఏపీలో సెల్ ఫోన్ల ఉత్పత్తి మార్కెట్లోకి... శ్రీ సిటీ జియోమీ ఫోన్లను ఆవిష్కరించనున్న చంద్రబాబు
ఉమ్మడి రాష్ట్ర విభజన జరిగే దాకా ఎక్కడో తయారైన సెల్ ఫోన్లే మనకు దిక్కు. రాష్ట్ర విభజన జరిగి తెలుగు నేల ఆంధ్రప్రదేశ్, తెలంగాణలుగా విడిపోయిన తర్వాత మన గడ్డ మీదే సెల్ ఫోన్ల తయారీ మొదలైంది. ఇందులో భాగంగా కొత్త రాష్ట్రం తెలంగాణలో తొలి అడుగు పడగా, మలి అడుగు ఏపీలోనూ పడింది. చిత్తూరు జిల్లాలోని శ్రీసిటీలో ప్లాంట్ ను ఏర్పాటు చేసిన చైనా మొబైల్ దిగ్గజం జియోమీ ఇప్పటికే తన తొలి ఉత్పత్తిని బయటకు తీసింది. మన నేలపై తయారైన జియోమీ ఫోన్లను ఈ నెల 10న ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు లాంఛనంగా ఆవిష్కరించనున్నారు.