: నెల్లూరు జిల్లా పోలీసులకు నైజీరియన్ల మస్కా...గంజాయి కేసులో పీఎస్ కు తరలిస్తుండగా పరార్
నెల్లూరు జిల్లా పోలీసులకు ఇద్దరు నైజీరియన్లు నేటి ఉదయం మస్కా కొట్టారు. గంజాయి తరలిస్తూ పోలీసులకు పట్టుబడ్డ నైజీరియన్లు పోలీస్ స్టేషన్ కు తరలిస్తుండగా చాకచక్యంగా తప్పించుకున్నారు. వివరాల్లోకెళితే... నెల్లూరు జిల్లా దొరవారి సత్రం వద్ద నేటి ఉదయం పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో ఓ కారులో గంజాయి తరలిస్తూ ఇద్దరు నైజీరియన్లు పట్టుబడ్డారు. వారి వద్ద నుంచి 30 కేజీల గంజాయి, కారును స్వాధీనం చేసుకున్న పోలీసులు అనంతరం వారిని పోలీసు స్టేషన్ కు తరలించారు. స్టేషన్ చేరుకోకముందే మార్గమధ్యంలోనే పోలీసులకు మస్కా కొట్టిన నైజీరియన్లు ఉడాయించారు. కాస్త ఆలస్యంగా విషయాన్ని గ్రహించిన పోలీసులు వారి కోసం గాలింపు చేపట్టారు.