: ‘నమో’ అంటే నమ్మించి మోసం చేసేవాడు... మోదీ ముద్దు పేరుకు సీపీఎం నేత కొత్త అర్థం


గడచిన సార్వత్రిక ఎన్నికల్లో అఖండ విజయం సాధించిన నరేంద్ర మోదీ, భారత ప్రధాని పీఠాన్ని సంపూర్ణ మెజారిటీతో అధిష్టించారు. అంతే, దేశవ్యాప్తంగా ఒక్కసారిగా ‘నమో’ మంత్రం మారుమోగింది. నరేంద్ర మోదీని బీజేపీ నేతలు ‘నమో’ పేరిట ముద్దుగా పిలుచుకుంటే, దానినే మీడియా కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేసింది. ప్రస్తుతం ఈ పేరుకు సీపీఐ ఏపీ కార్యదర్శి కె.రామకృష్ణ కొత్త అర్థం చెప్పారు. ‘నమో’ అంటే ‘నమ్మించి మోసం చేసేవాడు’ అని ఆ పేరుకు రామకృష్ణ కొత్త భాష్యం చెప్పారు. ‘‘నమో అంటే నరేంద్ర మోదీ కాదు.. నమ్మించి మోసం చేసేవాడు. ఏపీకి ప్రత్యేక హోదాపై కాలయాపన చేస్తూ మోదీ ప్రజలను మోసం చేస్తున్నారు. రాష్ట్రానికి పరిశ్రమలు రావాలన్నా, లక్షల మంది యువతకు ఉద్యోగాలు కావాలన్నా, వెనుకబడిన ప్రాంతాలు అభివృద్ధి చెందాలన్నా ప్రత్యేక హోదా, ప్రత్యేక ప్యాకేజీలతోనే సాధ్యం’’ అని రామకృష్ణ వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News