: సుష్మా స్థానంలో నేనున్నా లలిత్ కు సాయం చేసేదాన్ని...కానీ సుష్మా మాదిరి కాదంటున్న సోనియా!
ఐపీఎల్ మాజీ బాస్ లలిత్ మోదీ వీసా వ్యవహారం పార్లమెంటు ఉభయ సభలను కుదిపేస్తోంది. సమావేశాలు ప్రారంభమైన నాటి నుంచి ఇదే తంతు. ఒక్కరోజూ సభ సజావుగా సాగిన దాఖలా లేదు. కేన్సర్ బారిన పడ్డ లలిత్ మోదీ భార్యకు చికిత్స కోసమే సాయం చేశానని విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ వినిపించిన వాదనపై సోనియా గాంధీ నిన్న ఆసక్తికర వ్యాఖ్య చేశారు. ‘‘సుష్మా స్థానంలో నేనున్నా లలిత్ మోదీ భార్యకు సాయం చేసేదాన్నే. అయితే సుష్మాలా నిబంధనలు ఉల్లంఘించి మాత్రం కాదు. నిబంధనల మేరకే లలిత్ మోదీ భార్యకు సాయం చేసేదాన్ని’’ అని సోనియా గాంధీ వ్యాఖ్యానించారు.