: ఐఎస్ మరో ఘాతుకం... కోరిక తీర్చలేదని 19 మంది మహిళల దారుణ హత్య
ఖలీఫా (ఇస్లామిక్ రాజ్య)స్థాపన కోసమంటూ బయలుదేరిన ఐఎస్ఐఎస్ ఉగ్రవాదుల ఆగడాలు నానాటికీ మితిమీరిపోతున్నాయి. విదేశీయులను బందీలుగా పట్టుకుని అతి కిరాతకంగా హత్య చేేసి ఆ వీడియోలను సోషల్ నెట్ వర్కింగ్ సైట్లలో పెట్టి రాక్షసానందాన్ని పొందిన ఐఎస్ ఉగ్రవాదులు తమ లైంగిక వాంఛలు తీర్చుకునేందుకు ప్రత్యర్ధి తెగలకు చెందిన మహిళలను వాడుకుంటున్నారు. గతేడాది తమ కోరిక తీర్చడానికి అంగీకరించని 150 మంది ఇరాక్ మహిళలను ఉగ్రవాదులు అతి కిరాతకంగా హతమార్చారు. తాజాగా ఇదే కారణంతో ఇరాక్ కు చెందిన 19 మంది మహిళలను ఐఎస్ తీవ్రవాదులు కాల్చి చంపారు.