: భార్యకు పెళ్లి చేసి అత్తారింటికి పంపాడు!


ఇలాంటి వ్యక్తులు కూడా ఉంటారా? అనిపించే సంఘటన ఇది. ఉత్తరప్రదేశ్ లోని ఫైజాబాద్ లో ఓ వ్యక్తి తన భార్య మనసు తెలుసుకుని, ఆమె ఇష్టపడిన వ్యక్తితో పెళ్లి జరిపించాడు. ఏంటీ... 'కన్యాదానం' సినిమా స్టోరీ అనుకుంటున్నారా?... సేమ్ స్టోరీ... అయితే, రియల్ లైఫ్ లో జరిగింది... అంతే తేడా! వివరాల్లోకెళితే... ఫైజాబాద్ కు చెందిన పూల్ చంద్ కు చందా అనే యువతితో మూడేళ్ల కిందట వివాహం జరిగింది. అంతకుముందే ఆమె సూరజ్ అనే వ్యక్తికి మనసిచ్చింది. ఈ విషయం తెలియని పూల్ చంద్ ఆమెను పెళ్లిచేసుకున్నాడు. కొన్నాళ్లకు అతడు ఉద్యోగ రీత్యా జలంధర్ వెళ్లాడు. తిరిగి ఫైజాబాద్ వచ్చిన అతడికి భార్య చెప్పిన మాటతో మతిపోయింది. తాను పెళ్లికి ముందే మరో వ్యక్తిని ప్రేమించానని చందా ధైర్యం కూడబలుక్కుని చెప్పింది. తొలుత వ్యాకులతకు లోనైన పూల్ చంద్ ఆపై తేరుకుని మనసుపడ్డ వ్యక్తితో భార్యను పంపాలని నిర్ణయించుకున్నాడు. అనుకున్నదే తడవుగా చందా-సూరజ్ ల వివాహానికి పెద్దలను ఒప్పించాడు. ఆపై వారికి ఘనంగా పెళ్లి చేసి, చందాను అత్తారింటికి పంపాడా సహృదయుడు. చందాను సాగనంపుతూ భారీగా కానుకలు ఇచ్చి మరీ పంపాడు. నిజంగా గొప్ప వ్యక్తి కదూ!

  • Loading...

More Telugu News