: ప్రాక్టీసు మొదలెట్టిన యువీ... పునరాగమనంపై ధీమా
ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ తన పునరాగమనం ఖాయం అంటున్నాడు. శుక్రవారం బౌలింగ్ మెషీన్ సాయంతో ప్రాక్టీసు షురూ చేసిన ఈ పంజాబ్ క్రికెటర్ సాధన తాలూకు వీడియోను ఇన్ స్టాగ్రామ్ లో పోస్టు చేశాడు. మళ్లీ భారత జట్టులోకి వస్తానంటూ ధీమా వ్యక్తం చేశాడు. కాగా, యువీ ప్రాక్టీసు వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. 2011 వరల్డ్ కప్ తర్వాత క్యాన్సర్ బారిన పడిన యువరాజ్ ఆపై కోలుకుని మైదానంలో దిగినా ఫామ్ చాటలేకపోయాడు. తత్ఫలితంగా జట్టులో చోటు కోల్పోయాడు. ఈ ఏడాది 'వరల్డ్ కప్' జట్టులో కూడా ఈ లెఫ్ట్ హ్యాండర్ కు స్థానం లభించలేదు.