: ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియను దేశవ్యాప్తంగా చేపట్టిన కేంద్ర ఎన్నికల సంఘం
దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియను కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టింది. ఏపీ, తెలంగాణల్లో ఓటర్ల జాబితా సవరణకు ఎన్నికల సంఘం షెడ్యూల్ ను విడుదల చేసింది. అక్టోబర్ 5న ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల చేయనుంది. ఆ తర్వాత ఫిర్యాదుల స్వీకరణకు నెల రోజుల పాటు గడువు ఇవ్వనుంది. అనంతరం, 2016 జనవరి 11న తుది జాబితా విడుదల చేయనుంది.