: మరో బంగి అనంతయ్య... ఎంపీల సస్పెన్షన్ కు నిరసనగా గుండుతో సూర్యాపేట వాసి నిరసన
ఏపీలోని కర్నూలు జిల్లాకు చెందిన టీడీపీ నేత బంగి అనంతయ్య వినూత్న నిరసనలకు పెట్టింది పేరు. సందర్భాన్ని బట్టి విచిత్ర వేషధారణలతో రోడ్లపైకి వచ్చే ఆయన చేసే ఆందోళనలు రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక ఆసక్తిని రేకెత్తిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా తెలంగాణలోని నల్లగొండ జిల్లా సూర్యాపేటకు చెందిన రిక్షా చంద్రశేఖర్... బంగి అనంతయ్య తరహాలో వినూత్న నిరసనలకు తెరతీశాడు. మొన్న లోక్ సభ నుంచి సస్పెండైన ఎంపీల్లో నల్లగొండ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి కూడా ఉన్నారు. గుత్తా సస్పెన్షన్ తో బీజేపీ సర్కారుపై ఆగ్రహం వ్యక్తం చేసిన చంద్రశేఖర్ సూర్యాపేటలోని తెలుగు తల్లి విగ్రహం సాక్షిగా గుండు గీయించుకుని నిరసన వ్యక్తం చేశాడు. రాహుల్ గాంధీ జన జాగృతి జాతీయ అధ్యక్షుడిగా చంద్రశేఖర్ కొనసాగుతున్నాడట.