: వచ్చే అసెంబ్లీ సమావేశాలు ఏపీలోనే: యనమల
వచ్చే అసెంబ్లీ సమావేశాలను సాగర తీరం విశాఖపట్నంలో నిర్వహించాలని భావిస్తున్నట్టు ఏపీ ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు తెలిపారు. ఇప్పటికే ఈ అంశానికి సంబంధించి పరిశీలన జరుపుతున్నామని చెప్పారు. ఇదే జరిగితే, హైదరాబాద్ వెలుపల తొలిసారి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించినట్టు అవుతుంది. దీనికి తోడు, ఆంధ్రప్రదేశ్ తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉందని... రాష్ట్రాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉందని యనమల అన్నారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన తర్వాత ఏపీకి ప్రత్యేక హోదా అంశంపై పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉందని తెలిపారు.