: రోజాలాంటి వాళ్లు వెయ్యి మంది గోల చేసినా నష్టం లేదు: టీడీపీ ఎమ్మెల్యే యరపతినేని


వైకాపా ఎమ్మెల్యే రోజాపై టీడీపీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు మండిపడ్డారు. రిషితేశ్వరి కేసుకు సంబంధించి రోజా అనవసర రాద్ధాంతం చేస్తోందని... అలాంటి వారు వెయ్యి మంది వచ్చి, కాకిగోల చేసినా వచ్చిన నష్టమేమీ లేదని అన్నారు. రిషితేశ్వరి ఆత్మహత్యకు బాధ్యులైన వారు ఎంతటివారైనా శిక్ష నుంచి తప్పించుకునే పరిస్థితి లేదని చెప్పారు. నాగార్జున విశ్వవిద్యాలయాన్ని ప్రక్షాళన చేసి, ఉన్నతమైన విద్యాప్రమాణాలను నెలకొల్పుతామని తెలిపారు. కోర్టు పక్షులైన వైకాపా నేతలు న్యాయం గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు.

  • Loading...

More Telugu News