: మాజీ మంత్రి శంకర్రావుపై ఫిర్యాదు
మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత శంకర్రావుపై మానవ హక్కుల కమిషన్ లో ఫిర్యాదు నమోదైంది. మహబూబ్ నగర్ జిల్లా షాద్ నగర్ లో ఉన్న తన 40 ఎకరాల భూమిని శంకర్రావు ఆక్రమించుకుని, తనను వేధిస్తున్నారని ఆరోపిస్తూ శ్రీనివాసరావు అనే వ్యక్తి హెచ్చార్సీలో ఫిర్యాదు చేశారు. తనను ఎంతో ఇబ్బంది పెడుతున్న శంకర్రావుపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో ఆయన విన్నవించారు.