: 10న రిషితేశ్వరి ఘటనపై నివేదిక... నిందితులు ఎంతటివారైనా వదలం: ఏపీ మంత్రి ప్రత్తిపాటి


గుంటూరులోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో బీఆర్క్ విద్యార్థిని రిషితేశ్వరి ఆత్మహత్య ఘటనపై విచారణ కమిటీ నివేదిక ఈ నెల 10న తమకు అందనుందని ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు చెప్పారు. కొద్దిసేపటి క్రితం విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ ఘటనలో నిందితులుగా తేలిన వారు ఎంతటివారైనా వదిలే ప్రసక్తి లేదని ఆయన పునరుద్ఘాటించారు. ఈ ఘటనపై వైసీపీ ఎమ్మెల్యేలు రాద్ధాంతం చేయడం తగదన్నారు. ఘటనపై వివరాలు తెలుసుకోవడం, న్యాయం చేయమని డిమాండ్ చేయడం తప్పు కాదన్న ఆయన... నిన్న వర్సిటీలో వైసీపీ ఎమ్మెల్యేలు వ్యవహరించిన తీరును మాత్రం తప్పుబట్టారు.

  • Loading...

More Telugu News