: ఇంటికో ఐఏఎస్...ఒకే ఇంటిలో నలుగురు ఐపీఎస్ లు: సత్తా చాటిన యూపీ కుగ్రామం!
ఉత్తరప్రదేశ్ లోని జౌన్ పూర్ జిల్లాలోని మాధోపట్టి గ్రామంలో 75 ఇళ్లే ఉన్నాయి. అంటే, కుగ్రామం కిందే లెక్క. అయితేనేం, ఆ గ్రామం సత్తా చాటింది. రికార్డులకెక్కింది. ప్రస్తుతం ఆ గ్రామంలోని ప్రతి ఇంటి నుంచి ఓ ఐఏఎస్ అధికారి ఉన్నారు. ఏదేనీ కుటుంబంలో ఐఏఎస్ లేకుంటే కనీసం ఐపీఎస్ అధికారి అయినా ఉంటాడు. ఇక ఒకే ఇంటికి చెందిన నలుగురు అన్నదమ్ములూ ఐపీఎస్ అధికారులుగా పనిచేస్తున్నారు. 1952లో గ్రామానికి చెందిన ఇందూప్రకాశ్ అనే యువకుడు సివిల్స్ పరీక్షలు రాసి జాతీయ స్థాయిలో రెండో ర్యాంకు సాధించాడు. ఇక అప్పటి నుంచి అతడిని ఆదర్శంగా తీసుకున్న ఆ గ్రామ యువకులు ఏటా సివిల్స్ లో సత్తా చాటుతూనే ఉన్నారు. దీంతో ప్రస్తుతం ఆ గ్రామం... దేశంలోనే అత్యధిక మంది సివిల్ సర్వీస్ అధికారులను అందిస్తున్న గ్రామంగా రికార్డులకెక్కింది.