: జూనియర్లతో న్యూడ్ డ్యాన్సులు చేయించిన సీనియర్లు... సీఆర్ రెడ్డి కళాశాలలో ర్యాగింగ్ కలకలం


ఏపీలోని విద్యాలయాల్లో ర్యాగింగ్ భూతం కరాళనృత్యం చేస్తోంది. ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో ర్యాగింగ్ వేధింపులు తాళలేక రిషితేశ్వరి ఆత్మహత్య, ఆ తర్వాత అదే జిల్లాలోని ఇంజినీరింగ్ కళాశాలలో సునీత అనే విద్యార్థిని ఆత్మహత్య ఘటనలు కలకలం రేపాయి. తాజాగా ఈ ర్యాగింగ్ భూతం పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రం ఏలూరులోనూ జడలు విప్పింది. ఏలూరులోని ప్రతిష్ఠాత్మక సీఆర్ రెడ్డి ఇంజినీరింగ్ కళాశాల హాస్టల్ లో సీనియర్లు, జూనియర్లపై వికృత చేష్టలకు దిగారు. హాస్టల్ గదుల్లో నగ్నంగా నృత్యాలు చేయించారు. అంతటితో ఆగని సీనియర్లు, జూనియర్ విద్యార్థికి చెందిన ఓ ఏటీఎం కార్డును లాక్కుని అందులో నుంచి రూ.15 వేలను డ్రా చేసుకున్నారు. రాత్రంతా నరకం అనుభవించిన జూనియర్లు తెల్లవారగానే పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో సీనియర్లపై కేసులు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

  • Loading...

More Telugu News