: సోదరుడి ఉరికి ముందు ముంబైలోని కుటుంబీకులకు ఫోన్ చేసిన టైగర్ మెమన్
1993 బొంబాయి వరుస పేలుళ్ల కేసులో ప్రధాన నిందితుడు, యాకుబ్ మెమన్ సోదరుడు అయిన టైగర్ మెమన్ ప్రస్తుతం పాకిస్థాన్ లో ఉంటున్న విషయం తెలిసిందే. తాజాగా, ముంబైలో ఉన్న తన బంధువులకు టైగర్ మెమన్ ఫోన్ చేశాడు. యాకుబ్ మెమన్ ను కాసేపట్లో ఉరి తీస్తారనగా టైగర్ మెమన్ ఫోన్ చేశాడు. కొన్ని నిమిషాల పాటు ఈ ఫోన్ సంభాషణ కొనసాగింది. 'వాయిస్ ఓవర్ ఇంటర్నెట్ ప్రొటోకాల్' ద్వారా టైగర్ తన బంధువులతో మాట్లాడాడు. తన సోదరుడి ఉరికి తప్పకుండా ప్రతీకారం తీర్చుకుంటానని ఈ సందర్భంగా టైగర్ అన్నాడని సమాచారం. కుటుంబ సభ్యులను ఓదార్చాడు. పోలీసు ఉన్నతాధికారులు ఈ ఫోన్ కాల్ ను ట్రాప్ చేసి, రికార్డు చేశారు.