: వెంకయ్యనాయుడుతో భేటీ అయిన వైకాపా నేతలు
కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడుతో వైకాపా ఎంపీలు భేటీ అయ్యారు. పొగాకు సమస్యలపై పరిష్కారానికి కృషి చేయాలని ఈ సందర్భంగా వారు కోరారు. ఈ సమస్యపై కేంద్ర ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకోవాలని విన్నవించారు. వెంకయ్యను కలసిన వారిలో వైవీ సుబ్బారెడ్డి, మేకపాటి రాజమోహన్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, వరప్రసాద్ లు ఉన్నారు. ఇదే అంశంపై కేంద్ర మంత్రులు అరుణ్ జైట్లీ, రాధా మోహన్ సింగ్ లను వైకాపా ఎంపీలు కలిశారు.