: జస్టిస్ దీపక్ మిశ్రాకు బెదిరింపులు... యాకూబ్ కు ఉరి ఖరారు చేసిన ఫలితం!


1993 ముంబై వరుస పేలుళ్ల నిందితుడు యాకూబ్ మెమన్ కు ఉరి శిక్ష ఖరారు చేసిన సుప్రీంకోర్టు సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రాకు బెదిరింపులు మొదలయ్యాయి. ఈ మేరకు ఆయనకు నేటి ఉదయం బెదిరింపు లేఖ అందింది. ముంబై పేలుళ్ల కేసును విచారించిన టాడా కోర్టు యాకూబ్ కు ఉరి శిక్ష ఖరారు చేసింది. అనంతరం సుప్రీంకోర్టు కూడా దానిని ధ్రువీకరించింది. చివరి క్షణంలో యాకూబ్ దాఖలు చేసుకున్న క్షమాభిక్ష పిటిషన్లను సుప్రీంకోర్టులో జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం తోసిపుచ్చింది. నాడు అర్ధరాత్రి జరిగిన విచారణలో మెమన్ కు ఉరే సరి అంటూ జస్టిస్ దీపక్ మిశ్రా సంచలన తీర్పు చెప్పారు. దాంతో తెల్లవారగానే మెమన్ కు నాగ్ పూర్ జైలు అధికారులు ఉరి శిక్షను అమలు చేశారు. ఈ నేపథ్యంలో జస్టిస్ మిశ్రాకు భద్రతను పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం కూడా తీసుకుంది. తాజాగా నేటి ఉదయం గుర్తు తెలియని దుండగుల నుంచి జస్టిస్ మిశ్రాకు బెదిరింపు లేఖ రావడం గమనార్హం.

  • Loading...

More Telugu News