: అమరావతిలో 50 అంతస్తుల సచివాలయం... 47 లేదా 48వ ఫ్లోర్ లో సీఎం కార్యాలయం!
నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో సచివాలయాన్ని తెలుగుదనం ఉట్టిపడేలా 50 అంతస్తుల్లో అద్భుతరీతిలో నిర్మించాలని సీఆర్డీఏ (కాపిటల్ రీజియన్ డెవలప్ మెంట్ ఆథారిటీ) భావిస్తోంది. ఈ భవంతిని డిజైన్ చేసేందుకు ఇప్పటికే కొన్ని సంస్థలు ముందుకురాగా, వాటిల్లో ఒక కంపెనీకి రెండు మూడు రోజుల్లో డిజైన్ బాధ్యతలు అప్పగించనున్నట్టు తెలుస్తోంది. ఈ భవంతిలోని 47 లేదా 48వ అంతస్తులో సీఎం కార్యాలయం ఉంటుందని సమాచారం. అమరావతిలో తొలి దశలో కట్టాల్సిన అసెంబ్లీ, సచివాలయం, ఇతర ప్రభుత్వ కార్యాలయాలు, ఉద్యోగుల నివాస గృహాల సముదాయం తదితరాలను త్వరితగతిన ప్రారంభించాలని సీఆర్డీఏ నిర్ణయించుకుంది. నిర్మాణ పనులపై చర్చించేందుకు సీఆర్డీఏ కార్యదర్శి అజయ్ జైన్ ఇప్పటికే సింగపూర్ ప్రతినిధులతో సమావేశమై సీడ్ కేపిటల్ ప్రధాన ప్రణాళికపై చర్చలు జరిపారు.