: హైదరాబాద్ కూకట్ పల్లి భ్రమరాంబ థియేటర్లో ముగిసిన 'శ్రీమంతుడు' ప్రీమియర్ షో... అభిమానుల కేరింతలు
సూపర్ స్టార్ ప్రిన్స్ మహేష్ బాబు అభిమానులతో పాటు సినీ ప్రేక్షకులు ఎదురుచూస్తున్న 'శ్రీమంతుడు' చిత్రం ప్రత్యేక ప్రీమియర్ షో కొద్ది సేపటి క్రితం ముగిసింది. హైదరాబాద్, కూకట్ పల్లిలోని భ్రమరాంబ థియేటర్లో తెల్లవారుఝామున 4 గంటలకు ఈ షోను అభిమానుల కోసం ప్రత్యేకంగా ప్రదర్శించారు. ఈ చిత్రం ముగిసిన తరువాత బయటకు వచ్చిన అభిమానులు ఆనందంతో కేరింతలు కొట్టారు. బాణసంచా కాల్చి పండగ చేసుకున్నారు. నినాదాలతో హోరెత్తించారు. చిత్రం అద్భుతంగా ఉందని పలువురు వ్యాఖ్యానించారు. కాగా, అమెరికాలో స్పెషల్ ప్రీమియర్ షోలు కూడా పూర్తయ్యాయని తెలుస్తోంది. ఈ చిత్రం విజయవంతం అవుతుందని మహేష్ బాబు చాలా నమ్మకంగా ఉన్నారు.