: పట్టుబడ్డ ఉగ్రవాది నవీద్ పాక్ జాతీయుడే... ఫోన్లో భారత మీడియాతో మాట్లాడిన తండ్రి
జమ్మూ కాశ్మీర్లోని ఉధంపూర్ జిల్లాలో నాటకీయ పరిణామాల మధ్య బుధవారం పట్టుబడ్డ ఉగ్రవాది నవీద్ పాకిస్థాన్ జాతీయుడేనని నిర్ధారణ అయింది. నవీద్ తమ దేశానికి చెందిన వాడు కాదని పాక్ సర్కారు పేర్కొన్నదంతా బూటకమని తేలిపోయింది. నవీద్ తండ్రి మహ్మద్ యాకూబ్ ను 'హిందూస్థాన్ టైమ్స్' ఫోన్ లో సంప్రదించింది. "మీరు భారత్ నుంచి మాట్లాడుతున్నారా? మమ్మల్నిక్కడ చంపేస్తారు. అలాంటి కొడుకును కన్న దురదృష్టవంతుడినైన తండ్రిని నేనే. దయచేసి మా వాడిని వదిలేయండి. లష్కర్ మూకల నుంచి మాకు ప్రాణహాని ఉంది. బహుశా వారు భారత గడ్డపై నవీద్ చనిపోవాలని కోరుకున్నారేమో, కానీ, అతను సజీవంగా పట్టుబడ్డాడు. మాకు కష్టాలు తప్పేట్టులేవు" అని వాపోయాడు. అనంతరం ఫోన్ కట్ చేసి, స్విచాఫ్ చేశాడు.