: 8 వికెట్లతో బ్రాడ్ విశ్వరూపం... 60 పరుగులకే ఆసీస్ ఆలౌట్


ట్రెంట్ బ్రిడ్జ్ లో జరుగుతున్న 'యాషెస్' నాలుగో టెస్టులో ఇంగ్లాండ్ పేసర్ స్టూవర్ట్ బ్రాడ్ విశ్వరూపం ప్రదర్శించాడు. నిప్పులు చెరిగే బంతులతో ఆసీస్ బ్యాటింగ్ లైనప్ ను కకావికలం చేశాడు. టాస్ గెలిచిన ఇంగ్లాండ్ కెప్టెన్ కుక్ ఫీల్డింగ్ ఎంచుకోగా, తన కెప్టెన్ నిర్ణయం సరైనదేనని నిరూపించాడీ యువ ఆల్ రౌండర్. బ్రాడ్ 9.3 ఓవర్లలో కేవలం 15 పరుగులిచ్చి 8 వికెట్లు తీశాడు. దాంతో, కంగారూ జట్టు తొలి ఇన్నింగ్స్ లో 18.3 ఓవర్లలో 60 పరుగులకే కుప్పకూలింది. బ్రాడ్ అండ్ కో ధాటికి ఇద్దరు మినహా మిగతావారు రెండంకెల స్కోరు సాధించలేక చతికిలబడ్డారు. కెప్టెన్ క్లార్క్ 10, మిచెల్ జాన్సన్ 13 పరుగులు చేశారు. కొత్త బంతితో బౌలింగ్ కు దిగిన బ్రాడ్ ఆసీస్ బ్యాట్స్ మెన్ ను ఏ దశలోనూ క్రీజులో కుదురుకోనీయలేదు. కంగారూలు వచ్చినవారు వచ్చినట్టే పెవిలియన్ చేరారు. అనంతరం, తొలి ఇన్నింగ్స్ ఆరంభించిన ఇంగ్లాండ్ జట్టు 3 ఓవర్లలో 13 పరుగులు చేసి లంచ్ కు వెళ్లింది.

  • Loading...

More Telugu News