: పార్లమెంటులో ఒకరిద్దరు ఉగ్రవాదులున్నారు: ప్రకంపనలు రేపుతున్న ఎంపీ సాధ్వి ప్రాచి వ్యాఖ్యలు


భారత పార్లమెంటులో ఒకరిద్దరు ఉగ్రవాదులు ఉన్నారంటూ బీజేపీ ఎంపీ సాధ్వి ప్రాచి చేసిన వ్యాఖ్యలు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. కోర్టులు దోషిగా ప్రకటించిన వారిని వెనకేసుకొచ్చేందుకు ప్రయత్నించిన ఎంపీలు కూడా ఉగ్రవాదులే అని ఆమె తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రాచి వ్యాఖ్యలపై విపక్షాలు విరుచుకుపడ్డాయి. ఎంపీలను ఉగ్రవాదులతో పోల్చిన ఆమెపై స్పీకర్ కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాయి. యాకుబ్ మెమన్ ఉరిశిక్షకు వ్యతిరేకంగా మాట్లాడిన వారిని దృష్టిలో ఉంచుకునే ఆమె ఈ వ్యాఖ్యలు చేసి ఉంటారని భావిస్తున్నారు.

  • Loading...

More Telugu News