: తన ఎదుగుదలకు ద్రావిడే కారణమంటున్న పాక్ స్టార్ బ్యాట్స్ మన్
పాకిస్థాన్ జట్టులో నిలకడకు మారుపేరు యూనిస్ ఖాన్. ఎన్ని ఒడుదుడుకులు ఎదురైనా చెదరని మనోనిబ్బరంతో ఆడే యూనిస్ పాక్ క్రికెట్ కు వరం. వన్ డౌన్ లో దిగే ఈ రైట్ హ్యాండ్ బ్యాట్స్ మన్ ఎన్నో విజయాల్లో కీలకపాత్ర పోషించాడు. అయితే, తన ఎదుగుదలకు భారత బ్యాటింగ్ రాహుల్ ద్రావిడ్ ఇచ్చిన సలహాలు, సూచనలే కారణమని తెలిపాడు. కెరీర్ తొలినాళ్లలో ద్రావిడ్ ఎన్నో విషయాలు చెప్పాడని, అవి తన ఆటతీరును మెరుగుపర్చుకునేందుకు ఉపయోగపడ్డాయని యూనిస్ వివరించాడు. ద్రావిడ్ చెప్పిన బ్యాటింగ్ చిట్కాలతో తన ఆట గణనీయంగా మెరుగైందని అన్నాడు. ఆధునిక తరంలో ద్రావిడ్ పక్కా ప్రొఫెషనల్ ఆటగాడని కితాబిచ్చాడు.