: యూత్ కాంగ్రెస్ నేతలపై బీజేపీ ప్రివిలేజ్ మోషన్


కాంగ్రెస్ ఎంపీలను సస్పెండ్ చేసినందుకుగానూ ఢిల్లీలో స్పీకర్ సుమిత్రా మహాజన్ నివాసం బయట నిరసన, కార్యాలయంపై దాడి చేసిన యూత్ కాంగ్రెస్ నేతలపై లోక్ సభలో బీజేపీ సభ్యులు ప్రివిలేజ్ మోషన్ ను ప్రవేశపెట్టారు. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ఎం.వెంకయ్యనాయుడు సహా ఈ రోజు పలువురు బీజేపీ ఎంపీలు ఈ వ్యవహారాన్ని సభలో లేవనెత్తారు. నిరసన చేసిన వారికి ప్రివిలేజెస్ కమిటీ ద్వారా నోటీసులు పంపాలని కోరారు. ఇందుకు స్పీకర్ విముఖతగా వుండడంతో తరువాత పరిగణిస్తానని తెలిపారు. అయితే పలువురు ఎంపీలు యూత్ కాంగ్రెస్ నేతల చర్యపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటన మరోసారి పునరావృతం కాకూడదన్నారు.

  • Loading...

More Telugu News