: రాహుల్ కోసం రాష్ట్రాన్ని చీల్చి... ఇప్పుడు మొసలి కన్నీరు కారుస్తున్నారు: కావూరి, కన్నా ఫైర్
రాహుల్ గాంధీని ప్రధాన మంత్రిని చేయడం కోసం రాష్ట్రాన్ని సోనియాగాంధీ అడ్డంగా చీల్చారని బీజేపీ నేతలు కావూరి సాంబశివరావు, కన్నా లక్ష్మీనారాయణ ఆరోపించారు. ఇప్పుడేమో ప్రత్యేక హోదాపై కాంగ్రెస్ నేతలు మొసలి కన్నీరు కారుస్తున్నారని మండిపడ్డారు. ప్రత్యేక హోదా రాకుండా అడ్డుపడుతోంది కూడా కాంగ్రెస్ పార్టీనే అని... ప్రత్యేక హోదా కోరుతున్న ఇతర రాష్ట్రాలను ఆ పార్టీ రెచ్చగొడుతోందని దుయ్యబట్టారు. విభజన చట్టం అమలు చేయడానికి బీజేపీ కట్టుబడి ఉందని అన్నారు. మరోవైపు, కేంద్ర ప్రభుత్వం చేసిన సాయం గురించి మాట్లాడకుండా... రావాల్సిన నిధుల గురించే టీడీపీ నేతలు మాట్లాడుతున్నారని వారు మండిపడ్డారు.