: 'ఈ ర్యాగింగ్ తట్టుకోలేను, చచ్చిపోతున్నా' అంటూ ఫోన్ చేసిన విద్యార్థిని... క్షణాల్లో ప్రత్యక్షమైన పోలీసులు!


హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న నిజాం కళాశాలలో జరుగుతున్న ర్యాగింగ్ కలకలం రేపింది. కాలేజీలో డిగ్రీ రెండవ సంవత్సరం చదువుతున్న విద్యార్థిని రాజేశ్వరి, ఈ మధ్యాహ్నం పోలీసు కంట్రోల్ రూంకు ఫోన్ చేసి, తాను ర్యాగింగును తట్టుకోలేకపోతున్నానని, ఆత్మహత్య చేసుకుంటానని వెల్లడించింది. కంట్రోల్ రూం సిబ్బంది ఆమెను మాటల్లో పెట్టి వివరాలు అడుగుతూ, దగ్గర్లోని పోలీసులకు సమాచారం ఇచ్చారు. థర్డ్ ఇయర్ చదువుతున్న రాజశేఖర్ అనే విద్యార్థి తనను వేధిస్తున్నాడని రాజేశ్వరి ఆరోపించింది. ఆమె ఫోన్ చేసిన కాసేపటికే, సమీపంలోని పోలీసులు రాజేశ్వరిని అదుపులోకి తీసుకుని అబీడ్స్ పోలీసు స్టేషనుకు తరలించారు. పోలీసు అధికారులు రాజేశ్వరి నుంచి మరిన్ని వివరాలు రాబట్టే ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News