: ఈ నెల 22లోగా ఏపీకి ప్రత్యేక హోదా వస్తుందని భావిస్తున్నా: కేఈ
ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదాపై డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి చాలా ధీమాగా ఉన్నట్టు కనిపిస్తున్నారు. ఈ నెల 22లోగా హోదా వస్తుందని భావిస్తున్నానని ఓ తెలుగు చానల్ తో మాట్లాడుతూ తెలిపారు. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో రాష్ట్ర విభజన జరిగినందున ఇతర రాష్ట్రాలతో ఏపీని ముడి పెట్టడం సరికాదని పేర్కొన్నారు. అంతేగాక హోదాపై బీజేపీ పిల్లి మొగ్గలు వేయడం సరికాదని వ్యాఖ్యానించారు. అసలు విభజన బిల్లులోనే ప్రత్యేక హోదా అంశాన్ని చేరిస్తే ఇప్పుడీ పరిస్థితి వచ్చేది కాదని కేఈ అభిప్రాయపడ్డారు.