: బాబూరావుపై చర్యలు తీసుకోండి... పోలీసులకు ‘నాగార్జున’ వర్సిటీ రిజిస్ట్రార్ ఫిర్యాదు


గుంటూరులోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో ఆత్మహత్య చేసుకున్న బీఆర్క్ విద్యార్థిని రిషితేశ్వరి ఘటనపై ఎట్టకేలకు వర్సిటీ అధికారులు స్పందించారు. కొద్దిసేపటి క్రితం వైసీపీ ఎమ్మెల్యేలు వర్సిటీ వీసీ, రిజిస్ట్రార్ లను ఘటనపై నిలదీశారు. ఈ కేసులో ప్రత్యక్ష ప్రమేయముందని ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్క్ కళాశాల ప్రిన్పిపాల్ బాబూరావుపై ఎందుకు చర్యలు తీసుకోలేదని వారు వర్సిటీ వీసీని నిలదీశారు. వైసీపీ ఎమ్మెల్యేల ప్రశ్నల వర్షంతో నీళ్లు నమిలిన వీసీ, వెనువెంటనే దీనిపై తగిన విధంగా స్పందించాలని రిజిస్ట్రార్ కు ఆదేశాలు జారీ చేశారు. వీసీ ఆదేశాలతో రిజిస్ట్రార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రిన్సిపాల్ బాబూరావుపై చర్యలు తీసుకోవాలని ఆయన పోలీసులకు సూచించారు.

  • Loading...

More Telugu News