: భారీ వ్యూహంతో మూడు నెలల కిందటే వచ్చిన ఉగ్రవాది నవేద్: విచారణలో వెలుగుచూస్తున్న నిజాలు


నిన్న పట్టుబడ్డ ఉగ్రవాది మహమ్మద్ నవేద్ ను విచారిస్తున్న పోలీసులు పలు విషయాలను రాబట్టారు. లష్కరే తోయిబా నుంచి శిక్షణ పొందిన నవేద్ రంజాన్ మాసానికి ముందే జమ్మూకాశ్మీర్ లోకి అడుగు పెట్టాడని, గత మూడు నెలలుగా ఇక్కడే ఉన్నాడని, మెల్లగా దాడికి పథకాలు రూపొందించాడని అధికారులు తెలుసుకున్నారు. నెవాద్, మరో ఉగ్రవాది (హతుడు) కలసి ట్రక్కు ద్వారా ఉధంపూర్ కు చేరుకున్నారు. నెవాద్ తొలుత చెప్పినట్టు యాత్రికులు టార్గెట్ కాదని, బనిహల్ టన్నెల్ వద్ద రహదారిపై వెళ్లే సైనిక వాహనాలే లక్ష్యమని విచారించిన అధికారులు వెల్లడించారు. ఒక్కో ప్రశ్నకు ఒక్కో రకంగా నెవాద్ సమాధానాలు చెబుతుండటంతో, వీరు భారీ వ్యూహంతోనే వచ్చారని తెలుస్తోంది. కాగా, నవేద్ ను విచారించేందుకు ఎన్ఐఏ రంగంలోకి దిగనుంది.

  • Loading...

More Telugu News