: ఎప్పుడూ లేనంత నమ్మకంతో ఉన్నా, శ్రీమంతుడు హిట్టే!: మహేష్ బాబు


రేపు విడుదల కానున్న శ్రీమంతుడు చిత్రంపై తాను ఎంతో నమ్మకంతో ఉన్నానని ప్రిన్స్ మహేష్ బాబు వ్యాఖ్యానించాడు. తన గత చిత్రాలతో పోలిస్తే ఎప్పుడూ లేనంత నమ్మకంగా ఉన్నానని, ఈ సినిమా హిట్ అవుతుందని చెప్పాడు. చిత్రం విడుదల సందర్భంగా ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మహేష్ మాట్లాడారు. కథ విన్నప్పుడే నచ్చిందని, సెట్లో ఉన్నప్పుడు చిత్రంపై నమ్మకం మరింతగా పెరిగిందని అన్నాడు. తన ప్రతి చిత్రానికీ బాధ్యతగా పనిచేస్తానని, ఎంత బడ్జెట్ అవుతుందన్న విషయం నుంచి సినిమాకు మార్కెట్ ఎంత వరకూ ఉంటుందన్న అంశాలు పరిశీలించి, నిర్మాతలు సేఫ్ గా ఉండేలా చూసేందుకు ప్రయత్నిస్తానని తెలిపాడు. తన కెరీర్లో ప్రయోగాలు ఎక్కువ చేశానని, కొన్ని సార్లు తప్పులు జరిగినా, డీలా పడిపోలేదని అన్నాడు. ఇకపై కొత్త కథల్ని ఎంచుకునే ముందు కమర్షియల్ కోణం ఉండేలా చూసుకుంటానన్నాడు.

  • Loading...

More Telugu News