: ప్రత్యేక హోదా ఇవ్వకుంటే ఉద్యమం తీవ్రతరం చేస్తాం: అశోక్ బాబు


ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్యాకేజీ ఇస్తే సరిపోదని... ప్రత్యేక హోదా ఇచ్చితీరాల్సిందే అని ఏపీ ఎన్జీవో నేత అశోక్ బాబు డిమాండ్ చేశారు. ప్రత్యేక హోదా ఇవ్వకపోతే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఆర్థికంగా అధ్వానంగా ఉన్న ఏపీకి ప్రత్యేక హోదాతోనే మేలు జరుగుతుందని ఆయన అన్నారు. ఢిల్లీలో ప్రత్యేక హోదా కోసం ఏపీజేఎఫ్ చేస్తున్న ధర్నాకు తాము మద్దతు పలుకుతున్నామని చెప్పారు. హైదరాబాదులో ఏపీ ఉద్యోగులకు రక్షణ లేకుండా పోయిందని వాపోయారు.

  • Loading...

More Telugu News