: ఎన్నాళ్లకు గుర్తొచ్చింది!... ఏడాది తరువాత బీజేపీ కార్యాలయంలో నాగం
తెలంగాణ బీజేపీ నేత నాగం జనార్దన్ రెడ్డికి చాలా రోజుల తరువాత ఆ పార్టీ రాష్ట్ర కార్యాలయం గుర్తుకు వచ్చింది. సుమారు సంవత్సరం తరువాత బీజేపీ కార్యాలయానికి ఈ ఉదయం వచ్చిన ఆయన, పలువురు నేతలు, కార్యకర్తలతో సమావేశం అయ్యారు. గత సంవత్సరం అసెంబ్లీ ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరిన ఆయన ఎన్నికల్లో ఓటమి పాలైన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్న నాగం, మీడియా సమావేశాలు పెట్టాలన్నా, పార్టీ కార్యాలయంలో పెట్టకుండా సొంత ఏర్పాట్లు చేసుకుంటూ వచ్చారు. ఇవాళ బీజేపీ కార్యాలయంలో ఆయన కనిపించడంతో కార్యకర్తలు ఆనందాన్ని వ్యక్తం చేశారు.