: ఆడపిల్ల ఖరీదు రూ.10 లక్షలు, 500 గజాల స్థలమా?...బాబు సర్కారుపై రోజా ఫైర్


ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడిపై వైసీపీ ఎమ్మెల్యే రోజా ఫైరయ్యారు. గుంటూరులోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో ఆత్మహత్యకు పాల్పడిన బీఆర్క్ విద్యార్థిని రిషితేశ్వరి ఘటనపై కొద్దిసేపటి క్రితం నిరసన వ్యక్తం చేసిన సందర్భంగా రోజా మీడియాతో మాట్లాడారు. ఆడపిల్ల ఖరీదు రూ.10 లక్షలు, 500 గజాల స్థలమా? అంటూ ఆమె చంద్రబాబు సర్కారు నిర్ణయంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికార పార్టీ అండతోనే బీఆర్క్ కళాశాల ప్రిన్సిపాల్ బాబూరావు రెచ్చిపోయారని ఆమె ఆరోపించారు. ప్రిన్సిపాల్ ను తక్షణమే ఏ1 ముద్దాయిగా చేర్చాలని ఆమె డిమాండ్ చేశారు. రిషితేశ్వరికి న్యాయం జరిగేదాకా తాము విశ్రమించే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. మహిళలంటే చంద్రబాబుకు ఎందుకింత వివక్ష? అని ప్రశ్నించిన రోజా, బాబు మహిళా వ్యతిరేకిగా మారారని తేల్చేశారు.

  • Loading...

More Telugu News