: 'నరేంద్రమోదీ అహంకారి' అంటూ సోనియా మండిపాటు
చారిత్రక నాగా శాంతి ఒప్పందం కుదుర్చుకున్న వ్యవహారంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ అహంకారం ప్రదర్శించారంటూ కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఒప్పందాన్ని కుదుర్చుకునే ముందు ఈశాన్య రాష్ట్రాల సీఎంలను సంప్రదించడంలో ప్రధాని విఫలమయ్యారన్నారు. ఈ విషయంలో కనీసం ఆ రాష్ట్రాల్లోని తమ (కాంగ్రెస్) సీఎంలను విశ్వాసంలోకి తీసుకోకపోవడంతో తాము ఆశ్చర్యానికి గురయ్యామని సోనియా చెప్పారు. ఇక్కడే ప్రభుత్వ అహంకారం తెలిసిపోతుందన్నారు. ఇంతవరకు కూడా శాంతి ఒప్పందానికి సంబంధించిన వివరాలను ప్రభుత్వం విడుదల చేయలేదని ఆక్షేపించారు. అది చారిత్రక ఒప్పందం అయినప్పటికీ నేరుగా ప్రభావానికి గురవుతున్న రాష్ట్రాల (మణిపూర్, అస్సాం, అరుణాచల్ ప్రదేశ్) సీఎంలతో ఎందుకు సంప్రదించలేదని సోనియా మోదీని ప్రశ్నించారు.