: ‘నాగార్జున’ వద్ద రణరంగం... రిషితేశ్వరి ఘటనపై కాంగ్రెస్ ఆందోళన, మరికాసేపట్లో వైసీపీ


గుంటూరులోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ముందు తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. బీఆర్క్ విద్యార్థిని రిషితేశ్వరి ఘటనపై నిరసన తెలిపేందుకు వర్సిటీకి చేరుకున్న కాంగ్రెస్ పార్టీ నేతలు వర్సిటీలోకి చొచ్చుకెళ్లేందుకు యత్నించారు. అప్పటికే అక్కడ పెద్ద ఎత్తున మోహరించిన పోలీసు బలగాలు వారిని అడ్డుకున్నాయి. ఈ సందర్భంగా ఇరువర్గాల మధ్య తోపులాట చోటుచేసుకుంది. తమను లోపలికి అనుమతించాల్సిందేనని కాంగ్రెస్ నేతలు అక్కడే బైఠాయించారు. ఇదిలా ఉంటే, రిషితేశ్వరి ఘటనపై నిరసన తెలిపేందుకు మరికాసేపట్లో వైసీపీ నేతలు అక్కడికి చేరుకోనున్నారు. దీనిపై ముందుగానే సమాచారం అందుకున్న పోలీసులు అక్కడ భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

  • Loading...

More Telugu News