: రూ. 10,800కు విండోస్ 10 ల్యాప్ టాప్; విడుదల చేసిన ఏసర్


తక్కువ ధరల్లో ల్యాప్ టాప్ లను మార్కెటింగ్ చేస్తున్న సంస్థ ఏసర్, ఇటీవల విడుదలైన విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టమ్ తో కూడిన సరికొత్త ల్యాప్ టాప్ శ్రేణిని అందరికీ అందుబాటు ధరల్లో విడుదల చేసింది. 'ఆస్పైర్ వన్' పేరిట విడుదలైన ల్యాప్ టాప్ ల శ్రేణిలో ధరలు 169 డాలర్ల (సుమారు రూ. 10,800) నుంచి 199 డాలర్ల (సుమారు రూ. 12,700) వరకూ ఉంటాయని తెలిపింది. ఇవి ఎంచుకునే వేరియంట్ ను బట్టి 11 నుంచి 14 అంగుళాల డిస్ ప్లే కలిగివుంటాయని, 16 జిబి నుంచి 32 జిబి వరకూ మెమొరీ ఉంటుందని తెలిపింది. సెలెరాన్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్, 1.6 జీహెచ్ టర్బో బూస్ట్ టెక్నాలజీతో లభిస్తాయని వివరించింది. వీటి కొనుగోలుతో మైక్రోసాఫ్ట్ నుంచి 100 జిబి 'వన్ డ్రైవ్' క్లౌడ్ స్టోరేజ్ ఓచర్ ఉచితంగా అందిస్తున్నట్టు వివరించింది. బ్లూటూత్, వైఫై, యూఎస్ బీ 3.0, యూఎస్ బీ 2.0, హెచ్డీఎంఐ, ఎస్ డీ కార్డు స్లాట్లు ఉంటాయని పేర్కొంది. 6 నుంచి 7 గంటల పాటు బ్యాటరీ నిలుస్తుందని తెలిపింది.

  • Loading...

More Telugu News