: మన వైద్యులకు ‘చేతి’ శుభ్రత పట్టట్లేదు!... తేల్చేసిన తాజా అధ్యయనం


నిజమేనండోయ్, చేతి శుభ్రతపై గంటల తరబడి క్లాసులు పీకే భారతీయ వైద్యులకు ఆ అలవాటు వారికే అబ్బట్లేదట. అలాగే, మన నర్సులకు కూడా ఈ విషయంపై అంతగా పట్టింపేమీ లేదట. అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ (ఎయిమ్స్), లేడీ హార్గింగ్ మెడికల్ కాలేజీ సంయుక్తంగా నిర్వహించిన అధ్యయనం విస్తుగొలిపే విషయాలను వెల్లడి చేసింది. సాధారణంగా రోగులకు వైద్య సేవలందించే వైద్యులు, నర్సులు తప్పనిసరిగా చేతి శుభ్రతను పాటించాల్సి ఉంది. ఎందుకంటే, తాము అంటు రోగాలకు దూరంగా ఉండడంతో పాటు రోగుల్లోనూ ఒకరి నుంచి మరొకరికి రోగాలు అంటకుండా ఉండాలంటే వైద్య సిబ్బంది చేతి శుభ్రతలో కాస్తంత ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంది. ఇందుకోసం ఆల్కహాల్ బేస్డ్ హ్యాండ్ రబ్ (ఏబీహెచ్ ఆర్)ను ప్రపంచ ఆరోగ్య సంస్థ సిఫారసు చేసింది. అయితే మన వైద్యులు, నర్సులు ఇప్పటికీ దీనిని పాటించడం లేదట. కేవలం నీరు, సబ్బుతోనే పనికానిచ్చేస్తున్నారని ‘ఫార్మా రీసెర్చి అండ్ హెల్త్ సైన్సెస్’ తాజా సంచికలో ప్రచురితమైన ఈ సర్వే చెబుతోంది.

  • Loading...

More Telugu News