: మా అమ్మ చీరలు కట్టుకుంటుంది, వీరు మావాళ్లు కాదు: పాకిస్థాన్ లో గీత


అమృతసర్ లో ఉంటూ, తాను వాళ్ల కూతురినేనని చెప్పుకున్న జంట రాజేష్ కుమార్, రామ్ దులారీలు తన తల్లిదండ్రులు కాదని 13 ఏళ్లుగా పాకిస్థాన్ లో ఆశ్రయం పొందుతున్న మూగ, బధిర బాలిక గీత స్పష్టం చేసింది. ఓ ప్రైవేటు టీవీ చానల్ లో ఈ వార్త వస్తుండగా, ఆమె ఆశ్రయం పొందుతున్న 'ఈధీ' ఆశ్రమ నిర్వాహకులు గీతకు ఆ వార్తను చూపారు. తన తల్లి, ఇంట్లోని ఆడవాళ్లు చీరలు మాత్రమే కట్టుకుంటారని, ఈవిడ వేసుకున్నట్టు పంజాబీ సల్వార్ కమీజులు ధరించరని స్పష్టం చేసింది. రామ్ దులారీని పదేపదే చూసిన తరువాత ఆమె తన తల్లి కాదని తేల్చి చెప్పింది. కాగా, అమృతసర్ జంట చేస్తున్న వాదనలు గురించి తెలుసుకున్న పాకిస్థాన్ మానవ హక్కుల కార్యకర్త అన్సార్ బ్రూనే, ఆ కుటుంబాన్ని తాను కలుస్తానని డీఎన్ఏ పరీక్షలు చేయిస్తామని తెలిపారు. ఈ కేసును మానవత్వంతో పరిశీలించాలని భారత సర్కారుకు ఆయన విజ్ఞప్తి చేశారు.

  • Loading...

More Telugu News