: భగవద్గీత చదువుకుంటూ... కార్యకర్తల మధ్యలో జానారెడ్డి


నిన్నటి వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న టీ సీఎల్పీ నేత కుందూరు జానారెడ్డి విభిన్నంగా వ్యవహరించారు. సాధారణంగా సీఎల్పీ నేత హోదాలో వేదికపై కూర్చోవాల్సిన ఆయన అందుకు భిన్నంగా కార్యకర్తల మధ్యే కూర్చుండిపోయారు. వేదికపైకి రావాలని నేతలు బలవంతం చేసినా ‘‘నేను కార్యకర్తల్లోనే ఉంటా. మీరంతా మాట్లాడితే వింటా’’ అని ఆయన సున్నితంగా వారి ప్రతిపాదనను తిరస్కరించారు. ఆ తర్వాత సమావేశం జరుగుతుండగానే సెక్యూరిటీ సిబ్బంది చేత భగవద్గీత తెప్పించుకున్న ఆయన దాదాపు అరగంట పాటు అందులో లీనమయ్యారు.

  • Loading...

More Telugu News