: ఐఐటీ, ఎన్ఐటీల్లో 4,400 మంది డ్రాపవుట్స్... ఒత్తిడే కారణమట!


దేశంలోని ప్రతిష్ఠాత్మక ఇండియన్ ఇన్స్ టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ), నేషనల్ ఇన్స్ స్టిట్యూట్ ఆప్ టెక్నాలజీ (ఎన్ఐటీ) లలోని విద్యార్థులు ఒత్తిడి భరించలేకపోతున్నారని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఐఐటీ, ఎన్ఐటీల్లోని ఒత్తిడి కారణంగా గత మూడేళ్లలో 4,400 మంది విద్యార్థులు మధ్యలోనే చదువుకు స్వస్తి చెప్పారని లోక్ సభకు కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ తెలిపారు. ప్రశ్నోత్తరాల సమయంలో 2012-15 మధ్య విద్యా సంవత్సరాలల్లో ఐఐటీల నుంచి 2, 060 మంది, ఎన్ఐటీల నుంచి 2,352 మంది విద్యార్థులు మధ్యలోనే చదువు ఆపేశారని ఆమె వెల్లడించారు. వీరిలో ఆయా విద్యా సంస్థల్లో ఒత్తిడి భరించలేక కొందరు, ఉద్యోగాలు వచ్చి మరికొందరు, అనారోగ్యకారణాల వల్ల ఇంకొందరు, వ్యక్తి గత కారణాల వల్ల ఇతరులు అర్థాంతరంగా విద్య ముగించినట్టు ఆమె తెలిపారు. రూర్కీ ఐఐటీ (228), ఖరగ్ పూర్ ఐఐటీ (209) ల నుంచి ఎక్కువ మంది డ్రాపవుట్ కాగా, మద్రాసు, జోథ్ పూర్, రోపర్ ఐఐటీలు డ్రాపవుట్లు లేని ఐఐటీలుగా నిలిచాయి. దేశంలో 16 ఐఐటీలు, 30 ఎన్ఐటీలు ఉన్నాయని, వాటిల్లో కౌన్సిలర్స్ ను ఏర్పాటు చేసి డ్రాపవుట్స్ తగ్గిస్తామని ఆమె లోక్ సభకు హామీ ఇచ్చారు.

  • Loading...

More Telugu News