: తలసానికి విజ్ఞప్తుల జాబితా అందించిన తెలంగాణ ఫిలిం చాంబర్
తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ ను బుధవారం టీఎస్ ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులు కలిశారు. ఆయనకు తమ విజ్ఞప్తుల జాబితాను అందజేశారు. వారి విజ్ఞప్తులకు ఆయన సానుకూలంగా స్పందించారు. శక్తిమేర కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఫిలిం చాంబర్ భవన నిర్మాణం కోసం తమకు హైదరాబాదు ఫిలిం నగర్ లో స్థలం కేటాయించాలని ఫిలిం చాంబర్ ప్రతినిధులు కోరారు. మండల కేంద్రాల్లో మినీ థియేటర్ల ఏర్పాటుకు సర్కారు అనుమతి ఇవ్వాలని పేర్కొన్నారు. చిత్ర నిర్మాణ అనుమతులకు సంబంధించి సింగిల్ విండో విధానం అమలు చేయాలని కోరారు.