: ఉరికి కూడా వారు రిజర్వేషన్ కోరుకుంటున్నారా?: వెంకయ్యనాయుడు


ముంబయి వరుస పేలుళ్ల కేసు దోషి యాకుబ్ మెమన్ ను ఉరి తీసిన రోజు మీడియాలో వచ్చిన పలువురి భిన్న అభిప్రాయాలపై కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ఈరోజు తీవ్రంగా స్పందించారు. ఉరి శిక్ష విషయంలో కూడా వారు రిజర్వేషన్ కోరుకుంటున్నారా? అని ఢిల్లీలో ప్రశ్నించారు. మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం అంత్యక్రియల రోజు చాలా మంది వేరే అంశంపై దృష్టి పెట్టారన్నారు. కొన్ని మీడియాలైతే ఏ వర్గానికి చెందిన వారిని ఇంతవరకు ఉరి తీశారని నంబర్లు కూడా ఇచ్చారని చెప్పారు. అయితే ప్రజలు మాత్రం ఇవేమి పట్టించుకోలేదని పేర్కొన్నారు. గత కొన్నేళ్లలో 36 మందిని ఉరితీశారని, వారిలో మక్భూల్ భట్, అఫ్జల్ గురు, కసబ్, యాకుబ్ మెమన్ కూడా ఉన్నారన్నారు. అయితే వారు ఏ వర్గానికి చెందిన వారనే విషయంపై తాను మాట్లాడనని చెప్పారు. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు ఎంతమందిని ఉరితీశారనే విషయంపై చాలా స్పష్టమైన వివరాలు ఉన్నాయని తెలిపారు. అలాగని ఉరితీసే విషయంలో మీరేమైనా రిజర్వేషన్లు కోరుకుంటున్నారా? అని వెంకయ్య అడిగారు. అసలీ విషయాన్ని తాను అర్ధం చేసుకోలేకపోతున్నానని విస్మయం వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News