: గుడ్ న్యూస్... తెలుగువారిని విడిచిపెట్టిన ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు
వారం రోజుల ఉత్కంఠకు తెరపడింది. ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు కిడ్నాప్ చేసిన ఇద్దరు తెలుగువారినీ విడిచిపెట్టారు. లిబియాలో బందీలుగా ఉన్న వీరిని ఉగ్రవాదులు క్షేమంగా వదిలారని, వీరిప్పుడు భారత దౌత్య కార్యాలయంలో ఉన్నారని విదేశాంగ శాఖ అధికారి ఒకరు తెలిపారు. ఇదే విషయాన్ని ఎంపీ కంభంపాటి సైతం స్పష్టం చేస్తూ, సాధ్యమైనంత త్వరలో వీరిని రాష్ట్రానికి తీసుకువస్తామని తెలిపారు. కాగా, హైదరాబాదుకు చెందిన గోపికృష్ణ, బలరాంలు ఎనిమిదేళ్లగా లిబియాలోని ఓ యూనివర్సిటిలో ప్రొఫెసర్లుగా పనిచేస్తుండగా, వీరితో పాటు మరో ఇద్దరిని ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు కిడ్నాప్ చేసి, ఆపై ఇద్దరిని రెండు రోజుల క్రితం విడిచిపెట్టిన సంగతి తెలిసిందే. తమవారు క్షేమంగా విడుదలయ్యారన్న వార్త తెలుసుకుని హరికృష్ణ, బలరాం కుటుంబ సభ్యులు సంతోషాన్ని వ్యక్తం చేశారు.