: ‘వ్యాపం’ మరణాలు 34... పార్లమెంటుకు తెలిపిన హోం మంత్రిత్వ శాఖ
దేశవ్యాప్తంగా సంచలనం రేపిన మధ్యప్రదేశ్ వ్యాపం కుంభకోణంలో ఇప్పటివరకు 50 మంది వరకు మరణించారని మీడియా కోడై కూస్తోంది. అయితే ఈ కేసుతో సంబంధం ఉన్న వారిలో 34 మంది మాత్రమే మరణించారని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ చెబుతోంది. ఈ మేరకు ఆ శాఖ పార్లమెంటుకు సమాచారం పంపింది. మధ్యప్రదేశ్ అందించిన సమాచారం మేరకే ఈ లెక్క చెబుతున్నామని కూడా ఆ శాఖ పార్లమెంటుకు తెలియజేసింది.